నంద‌మూరి, మెగా అభిమానుల‌కు ఉగాది స‌ర్‌ప్రైజ్‌

తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది సంద‌ర్భంగా కొత్త సినిమా క‌బుర్ల‌తో సోష‌ల్ మీడియా హోరెత్తుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 March 2023 1:30 PM IST
Ugadi,Ugadi posters from upcoming movies

ఉగాది సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్లు

సాధార‌ణంగా ఏదైనా పండుగ వ‌చ్చిందంటే చాలు సినీప్రియులు త‌మ అభిమాన న‌టీన‌టుల చిత్రాల అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది సంద‌ర్భంగా కొత్త సినిమా క‌బుర్ల‌తో సోష‌ల్ మీడియా హోరెత్తుతోంది. కొన్ని చిత్రాలు పోస్ట‌ర్లు విడుద‌ల చేయ‌గా మ‌రికొన్ని ట్రైల‌ర్లు, విడుద‌ల తేదీల‌తో అల‌రించాయి. నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ.. ఈ సారి మీ ఊహ‌ల‌కు మించి అంటూ త‌న కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా, చిరంజీవి త‌న త‌రువాతి సినిమా విడుద‌ల తేదీని చెప్పేశారు.

ఎన్‌బీకె 108 ఫ‌స్ట్ లుక్‌..

సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో బ్లాక్‌బ‌స్టర్ హిట్ అందుకున్నారు బాల‌కృష్ణ‌. ఆయ‌న అనిల్ రావిపూడి ద‌ర్శ‌త‌క్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ క‌థానాయిక కాగా.. ధ‌మాకా బ్యూటీ శ్రీలీల ఓ కీల‌క‌ పాత్రలో న‌టిస్తోంది. శరవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్ర ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సారి మీ ఊహలకు మించి సినిమా ఉండబోతుందని అంటూ ప‌వ‌ర్ పుల్ లుక్‌తో ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

భోళా శంక‌ర్ విడుద‌ల తేదీ..

వాల్తేరు వీర‌య్య ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న మెగాస్టార్ చిరంజీవి త‌న త‌రువాతి చిత్రం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించేశారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టిస్తున్న చిత్రం భోళా శంక‌ర్‌. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క‌థానాయిక కాగా.. కీర్తి సురేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ కుర్తా, షేడ్స్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించగా.. రాయల్ చైర్‌లో ఒకవైపు కీర్తి సురేష్, మ‌రో వైపు తమన్నా ట్రెడిషనల్ వేర్‌లో దర్జాగా కూర్చుని పండగ కళను తీసుకొచ్చారు. వారిద్దరూ అలా కూర్చుని ఉంటే.. ఆ చైర్‌కు వెనుకాల ఇద్ద‌రి మధ్యలో చిరంజీవి హుందాగా నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.


Next Story