కంగన, తాప్సీ మధ్య ట్వీట్ల యుద్దం.. స్క్రీన్ షాట్లు వైరల్
Twitter War Erupts Between Kangana Ranaut and Tapsee Pannu.హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మద్య వివాదం మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది.
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2021 7:01 AM GMT
హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మద్య వివాదం మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది. వీరిద్దరు ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తరుచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. తాజాగా రైతుల నిరసనల విషయంలో మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ ఇటీవల ప్రముఖ పాప్ గాయని రిహానా.. 'రైతుల గురించి ఎవరూ మాట్లాడరేం' అంటూ ట్వీట్ చేసింది. 'మాట్లాడడానికి వారు రైతులైతే కాదు.. ఉగ్రవాదులు.. పూర్తి అవగాహన లేకుండా మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు' అని కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
కంగనను ఉద్దేశిస్తూ పరోక్షంగా తాప్సీ ఓ ట్వీట్ చేసింది. 'ఒక ట్వీట్ ఐక్యతను దెబ్బతీస్తూ, జోక్ విశ్వాసాన్ని కదలించింది. మీ విలువలను, వ్యవస్థలను బలపరిచేందుకు మీ పని మీరు చేయాల్సి ఉంటుంది తప్ప ఇతరులకు పాఠాలు నేర్చించడానికి టీచర్‌గా మారొద్దు' అంటూ ట్వీట్ చేసింది. రెహాన్నేకు తాప్సీ మద్దతుగా నిలిచింది.
ఆ ట్వీట్‌పై కంగన స్పందిస్తూ... 'బీ గ్రేడ్ మనుషులకు బీ గ్రేడ్ ఆలోచనలే వస్తాయి. మాతృభూమి, కుటుంబం కోసం నిలబడగాలి. కర్మ లేక ధర్మమో తెలియదు కాని ఉచిత సలహాలను వినకండి. వాటి వలన దేశానికి ఉపయోగపడదు' అంటూ కంగనా కౌంటర్ ఇచ్చింది. వీరిద్దరి ట్వీట్ల స్క్రీన్ షాట్లను నెటిజన్ లు వైరల్ చేస్తున్నారు. ఈ ట్వీట్లు అంత విషపూరితంగా, వివాస్పదంగా లేకపోతే బాగుండేవంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో దానిపై తాప్సీ స్పందిస్తూ, విషం అనేది వారి డీఎన్ఏలోనే ఉండొచ్చంటూ కామెంట్ చేసింది.