బుల్లితెర న‌టుడి ఇంట తీవ్ర విషాదం

TV Actor Shaheer Sheikh’s father passes away.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2022 11:19 AM IST
బుల్లితెర న‌టుడి ఇంట తీవ్ర విషాదం

బుల్లితెర న‌టుడు, 'యే రిష్తా హై ప్యార్ కే' సీరియ‌ల్ హీరో షాహీర్ షేక్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. షాహీర్ షేక్ తండ్రి షెహ‌నావాజ్ షేక్ క‌రోనాతో క‌న్నుమూశారు. గ‌త‌కొద్ది రోజుల క్రితం ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే.. గురువారం ఆయ‌న ప‌రిస్థితి మ‌రింత విష‌మించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని న‌టుడు అలీ గోని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. మీ ఆత్మ‌కు శాంతి చేకూరుగాక అంకుల్. ధైర్యాన్ని కోల్పోవ‌ద్దు షాహీర్ షేక్ బాయ్ అంటూ అలీ గోని ట్వీట్ చేశారు.

ఆయ‌న మృతి ప‌ట్ల‌ ప‌లువురు సెల‌బ్రిటీలు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఇక అంక‌ముందు అంటే మంగ‌ళ‌వారం రాత్రి మా నాన్న తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించండి అంటూ షాహీర్ షేక్ ట్వీట్ చేశారు.

'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ', 'యే రిష్తా క్యా కె' వంటి సీరియ‌ల్స్‌లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న షాహీర్ ఇటీవ‌లే తండ్రి అయ్యాడు. షాహిర్ భార్య రుచిక‌పూర్ గ‌తేడాది సెప్టెంబ‌ర్ 9న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇంత‌లోనే త‌న తండ్రిని కోల్పోవ‌డంతో షాహీర్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.

Next Story