మాళవికా మోహనన్‌పై నయన్ అభిమానుల ఆగ్రహం.. వెనక్కి తగ్గిందిగా
Tug of war continues between Nayanthara and Malavika Mohanan.మాస్టర్ ఫేమ్ మాళవికా మోహనన్ పై నయనతార అభిమానులు
By తోట వంశీ కుమార్
మాస్టర్ ఫేమ్ మాళవికా మోహనన్ పై నయనతార అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల తాను నటించిన క్రిస్టీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాళవికా మోహనన్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం.
చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మాళవికా మోహనన్ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ అంటే ఇష్టం ఉందని చెప్పింది. హీరోయిన్‌లకు కూడా హీరోల మాదిరిగానే సూపర్ స్టార్ అంటూ పిలవాలని అంది. మాళవికా మోహనన్ చేసిన ఈ వ్యాఖ్యలపై లేడీ సూపర్ స్టార్ నయనతార అభిమానులు మండిపడుతున్నారు. ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది మాళవికా మోహనన్. నటీమణులందరినీ ఉద్దేశిస్తూ ఆ పదాన్ని ఉపయోగించి తన అభిప్రాయాన్ని బయటపెట్టినట్లు చెప్పింది. అంతేకాని ఏ ఒక్కరినో ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఇక తనకు నయనతార అంటే ఎంతో ఇష్టం అని, ఆమెను ఓ సీనియర్‌గా బావించి నటనపరంగా పరంగా ప్రేరణ పొందుతానని చెప్పింది. ఇప్పటికైనా అందరూ కాస్త శాంతించాలని కోరింది.
ఇదిలా ఉంటే.. గతంలోనూ నయనతారను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాళవికా మోహనన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా నయన్ ఫ్యాన్స్ మాళవికాను తీవ్రంగా ట్రోల్ చేయగా మధ్యలో నయన్ స్పందించడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది.
Dont Call As Lady Super #MalavikaMohanan pic.twitter.com/OS3wTml8j4
— chettyrajubhai (@chettyrajubhai) February 11, 2023