టక్ జగదీష్ : సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసు వాడు
Tuck Songs out from Tuck Jagadish.నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో
By తోట వంశీ కుమార్ Published on
3 Sep 2021 7:41 AM GMT

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'టక్ జగదీష్'. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నిన్ను కోరి' వంటి సూపర్ డూపర్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కాగా.. ఎన్నో అవాంతరాలు దాటుకుని.. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. తాజాగా 'సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసు వాడు' అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో ముందుగా నాని, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణను పెట్టారు. ఈ పాట విశేషం ఏంటంటే.. చిత్ర దర్శకుడు శివ నిర్మాణ లిరిక్స్ అందించడమే కాకుండా స్వయంగా పాడారు. రాయలసీమ యాసలో సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. జగపతిబాబు, రావురమేవ్, నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Next Story