టక్ జగదీష్ టీజర్.. పండగకు వచ్చే సినిమాకాదు.. పండగలాంటి మూవీ

Tuck Jagadish Teaser out.నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం టక్ జగదీష్ టీజర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2021 5:47 PM IST
Tuck Jagadish Teaser

నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'ట‌క్ జ‌గ‌దీష్'. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి- హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రేపు(ఫిబ్ర‌వ‌రి 24న‌) నాని పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం నేడు టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ సందర్భంగా 'పండగకు వచ్చే సినిమాలు కొన్ని.. పండగలాంటి సినిమాలు కొన్ని' అని నాని ట్వీట్ చేశాడు.

'ఏటి కొక్క పూట ఏడాది పాట.. నాయుడోరి నోట నుంచి వచ్చిందే మాట' అనే బ్యాగ్రౌండ్ సాంగ్ తో ఈ టీజర్ స్టార్ అయింది. నాని నీట్ గా టక్ చేసుకుని కోడిపుంజుని పట్టుకొని కనిపించాడు. టీజర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ఇందులో కావల్సినంత యాక్షన్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. దీనికి థమన్ అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఒక డైలాగ్ కూడా లేకుండా కేవలం పాటతోనే చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు.




Next Story