నాయుడిగారి అబ్బాయి ట‌క్ జ‌గ‌దీష్ చెబుతున్నాడు మొద‌లెట్టండి

Tuck Jagadeesh release on september 10.నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం ట‌క్ జ‌గ‌దీష్. శివ నిర్వాణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2021 9:46 AM GMT
నాయుడిగారి అబ్బాయి ట‌క్ జ‌గ‌దీష్ చెబుతున్నాడు మొద‌లెట్టండి

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం ట‌క్ జ‌గ‌దీష్. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. నిన్ను కోరి' వంటి సూపర్ డూపర్ హిట్ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కాగా.. ఎన్నో అవాంత‌రాలు దాటుకుని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైంది. ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌రు 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

పండ‌గ‌కి మన ఫ్యామిలీతో ట‌క్ జ‌గ‌దీష్ చూద్దాం నాని త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. భూదేవిపురం చిన్న కొడుకు, నాయుడు గారి అబ్బాయి ట‌క్ జ‌గ‌దీష్ చెబుతున్నాడు.. మొద‌లెట్టండి అని నాని చెప్పిన డైలాగ్ అద్బుతంగా ఉంది. ఈ చిత్రంలో నాని సర‌స‌న రీతూవ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు, రావుర‌మేవ్‌, న‌రేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story