విజ‌య్ దేవ‌ర‌కొండలా మీరు ఎల్ల‌ప్పుడూ హెల్మెట్ ధ‌రించండి

TSRTC Birthday wishes to Vijay Devarakonda.ఆ పిల్ల నాది అంటూ అర్జున్ రెడ్డి చిత్రంలో రౌడీయిజం చూపించినా, మేడ‌మ్ మేడ‌మ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 May 2022 6:28 AM GMT
విజ‌య్ దేవ‌ర‌కొండలా మీరు ఎల్ల‌ప్పుడూ హెల్మెట్ ధ‌రించండి

'ఆ పిల్ల నాది' అంటూ 'అర్జున్ రెడ్డి' చిత్రంలో రౌడీయిజం చూపించినా, 'మేడ‌మ్ మేడ‌మ్‌.. ప్లీస్ మేడ‌మ్' అంటూ అమాయ‌కంగా 'గీత‌గోవిందం' లో హీరోయిన్ వెంట‌ప‌డినా అది విజ‌య్‌దేవ‌ర‌కొండ కే చెల్లుతుంది. ఈ రౌడీ హీరో నిన్న‌(మే 9న) 33 వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ యంగ్ హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డంతో పాటు రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించింది. బైక్‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు హెల్మెట్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని చెబుతూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ హెల్మెట్ ధ‌రించి బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ఫోటోని ట్వీట్ చేసింది.

దీనిపై హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించారు. త‌న పుట్టిన రోజున శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన టీఎస్ ఆర్టీసీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంతేకాకుండా ఎల్ల‌ప్పుడూ హెల్మెట్లు ధ‌రించాల‌ని అభిమానుల‌కు సూచించారు.

కాగా.. విజ‌య్ ట్వీట్‌పై టీఎస్ ఆర్టీసీ స్పందిస్తూ.. రోడ్డు భ‌ద్ర‌త‌, హెల్మెట్ల పై అవగాహాన క‌లిగిస్తున్నందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు సార్ అంటూ మ‌రో ట్వీట్ చేసింది.

Next Story