ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
TS Government releases GO allowing 5th show for Radhe Shyam movie.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం
By తోట వంశీ కుమార్ Published on
10 March 2022 12:02 PM GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'రాధేశ్యామ్'. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం శుక్రవారం ( మార్చి 11) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రియులకి శుభవార్త చెప్పింది. రాధే శ్యామ్ చిత్రానికి ఐదో ఆటకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 11 నుంచి 25వ తేదీ వరకు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు థియేటర్లకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద అప్పుడే కోలాహలం మొదలైంది. పెద్ద పెద్ద కటౌట్‌లు థియేటర్లు ముందు ఏర్పాటు చేస్తున్నారు.
Next Story