ప్రభాస్ కు ఫైన్ వేసిన పోలీసులు అంటూ వార్తలు.. నిజం ఇదే..!

ప్రభాస్ కు ఫైన్ వేసిన పోలీసులు అంటూ వార్తలు.. నిజం ఇదే..! మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నటుడు ప్రభాస్ కారుపై హైదరాబాద్ నగర పోలీసులు శనివారం కేసు నమోదు చేసి జరిమానా విధించారనే వార్తలు వైరల్ అయ్యాయి.

By Medi Samrat  Published on  17 April 2022 6:03 AM GMT
ప్రభాస్ కు ఫైన్ వేసిన పోలీసులు అంటూ వార్తలు.. నిజం ఇదే..!

మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నటుడు ప్రభాస్ కారుపై హైదరాబాద్ నగర పోలీసులు శనివారం కేసు నమోదు చేసి జరిమానా విధించారనే వార్తలు వైరల్ అయ్యాయి. జూబ్లీహిల్స్‌లో ప్రభాస్ కార్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో నంబర్‌ ప్లేట్‌, బ్లాక్‌ ఫిల్మ్‌ కారణంగా కారును ఆపారని వార్తలు వచ్చాయి. సబ్ ఇన్ స్పెక్టర్ కారుకు రూ.1600 జరిమానా విధించగా.. వాహనంలో ప్రభాస్ లేడని కొన్ని మీడియా సంస్థలు శనివారం నాడు కథనాలను ప్రసారం చేశాయి.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని ప్రభాస్ పీఆర్ టీమ్ చెబుతోంది. బ్లాక్‌ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్‌ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ. 1600 జరిమానా విధించారనే వార్తలు నిజం కాదని ప్రభాస్‌ పీఆర్‌ టీం స్పష్టతనిచ్చింది. ఆ కారుకి, ప్రభాస్‌కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేశారు. దయచేసి గమనించగలరని పీఆర్‌ టీం చెప్పుకొచ్చింది. ఈ ఫేక్‌ న్యూస్‌పై ప్రభాస్‌ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఆశ్రయించారు. కారు ప్రభాస్‌ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నాసిరకం నంబర్ ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్‌లపై స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. గత రెండు వారాల్లో 1,000 కేసులు బుక్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నందున బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించాలని పోలీసులు కారు యజమానులను కోరారు.

Next Story