ఎన్టీఆర్ పోస్టర్ మీద తీవ్రమైన ట్రోల్స్..!

Trolls on Komaram Bheem New Look.ఫ్యాన్ మేడ్ పోస్టర్ లాగా ఎన్టీఆర్ లుక్ ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులే బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక మీమ్స్ లో అయితే పెద్ద ఎత్తున ఆర్.ఆర్.ఆర్. టీమ్ ను ట్రోల్ చేస్తూ ఉన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 11:09 AM GMT
komaram bheem

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కారణంగా ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ ఈరోజు పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే..! ఆయుధాన్ని గురిపెట్టి నీళ్ల‌లోంచి దూసుకొస్తోన్న ఎన్టీఆర్ ను చిత్ర యూనిట్ చూపించింది. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. భీమ్‌కు బంగారం లాంటి మ‌న‌సు ఉంటుంద‌ని, అయితే, తిరుగుబాటు మొద‌లు పెట్టాడంటే ఎంతో ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడ‌ని రాజ‌మౌళి పేర్కొన్నారు. బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వచ్చింది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.

ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజున ఆర్.ఆర్.ఆర్. నుండి సర్ ప్రైజ్ అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ ఘోరంగా విఫలమైంది. ఏదో ఫ్యాన్ మేడ్ పోస్టర్ లాగా ఎన్టీఆర్ లుక్ ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులే బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక మీమ్స్ లో అయితే పెద్ద ఎత్తున ఆర్.ఆర్.ఆర్. టీమ్ ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. సినిమాకు ఎంతో బడ్జెట్ పెడుతున్నారు. పోస్టర్ కు కూడా కాస్త డబ్బులు కేటాయించి ఉంటే ఇంకాస్త బాగుండేది కదా అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. పిక్స్ ఆర్ట్ లో చేశారు కదా పోస్టర్ అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదో తూతూ మంత్రంగా పోస్టర్ వదలాలి అంటే వదలాలన్నట్టుగా వదిలారా అని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ అభిమానులు ఆర్.ఆర్.ఆర్. పోస్టర్ వలన చాలానే అప్సెట్ అయ్యారు.
Next Story