రేప్ సీన్ దుమారం.. 'లియో' నటుడిపై త్రిష ఫైర్
'లియో' సినిమాలో హీరోయిన్ త్రిషన్ రేప్ చేసే సీన్ లేకపోవడంతో బాధపడ్డానన్న నటుడు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
By అంజి Published on 19 Nov 2023 10:45 AM ISTరేప్ సీన్ దుమారం.. 'లియో' నటుడిపై త్రిష ఫైర్
'లియో' సినిమాలో హీరోయిన్ త్రిషన్ రేప్ చేసే సీన్ లేకపోవడంతో బాధపడ్డానన్న నటుడు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. హీరోయిన్ మాళవికా మోహన్, సింగర్ చిన్మయి, నిర్మాత అదితితో పాటు పలువురు నటీమణులు, దర్శకులు అతడి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. అలీఖాన్ వ్యాఖ్యలు అతడి నీచపు సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తమిళ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా నటించిన 'లియో' సినిమా అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. తాజాగా ఈ సినిమాపై ఒక ఇంటర్వ్యూలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడారు. ఈ క్రమంలోనే హీరోయిన్ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మన్సూర్ అలీ ఖాన్ 'లియో' సినిమాపై మాట్లాడుతూ.. లియో సినిమాలో త్రిష నటిస్తున్నారని తనకు తెలిసిందని, తాను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో తాను చేసే సీన్లలో ఒక్క సీన్ అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నానని అన్నారు. తన మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నానని, కానీ అలా జరగలేదని అన్నారు. తాను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశానని, తనకు రేప్ సీన్లు కొత్త కాదని అన్నారు. కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం తనకు చూపించలేదపి మన్సూర్ అన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై పలువురు సినీ సెలబ్రిటీలు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై హీరోయిన్ త్రిష ఘాటుగా స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్ తన గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో తన దృష్టికి వచ్చిందని, మన్సూర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరమైనదిగా అనిపిస్తోందన్నారు. అతనిలాంటి దయనీయ వ్యక్తితో ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు తాను అదృష్టవంతురాలిని అని అన్నారు. తన మిగిలిన కెరీర్ లో అలాగే తన సినిమాలో అతడు లేకుండా చూసుకుంటానని అన్నారు.
The context ....😡😡pic.twitter.com/n0ge3Qkzer
— Aryan (@chinchat09) November 18, 2023