బాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ దర్శకుడు కన్నుమూత

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు సంజయ్‌ గధ్వి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  19 Nov 2023 8:58 AM GMT
tragedy,  bollywood, director, sanjay, death,

బాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ దర్శకుడు కన్నుమూత

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు సంజయ్‌ గధ్వి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ధూమ్‌, ధూమ్‌-2 సినిమాలకు దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్, అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధూమ్ ఫ్రాంచైజీతో సంజయ్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. మరో మూడు రోజుల్లోనే సంజయ్‌ గధ్వి పుట్టిన రోజు ఉంది. ఆలోపే ఆయన కన్నుమూయడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. సంజయ్‌ గధ్వి ప్రస్తుత వయసు 57 సంవత్సరాలు.

డైరెక్టర్ సంజయ్‌ గధ్వికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంజయ్‌ గధ్వి ఇటీవలే స్నేహితులతో కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూశారని.. అంతలోనే ఆయన మరణవార్త వినడం షాకింగ్‌గా ఉందని చెబుతున్నారు. సంజయ్‌ మేరే యార్‌కి షాదీ హై, కిడ్నాప్‌ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. 2020లో ఆజాద్ గజబ్‌ లవ్, ఆపరేషన్ పరిందే సినిమాను కూడా సంజయ్ గధ్వినే తెరకెక్కించారు. 2000వ సంవత్సరంలో లియో మూవీతో డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 2004లో యాక్షన్ థ్రిల్లర్‌ ధూమ్‌తో సంజయ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంజయ్‌ మరణం పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ట్విట్టర్‌ వేదికగా తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకున్నారు.

Next Story