దేవీశ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాదాలు

Tragedies in the Desi Sri Prasad family.ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్ ఇంట వ‌రుస విషాదాలు చోటుచేసుకున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2021 8:20 AM GMT
దేవీశ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాదాలు

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్ ఇంట వ‌రుస విషాదాలు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న దేవీ శ్రీ ప్ర‌సాద్ బాబాయ్ బుల్గానిన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా.. త‌మ్ముడి మ‌ర‌ణ‌వార్త‌ను విన్న ఆయ‌న అక్క‌(దేవీ శ్రీ ప్ర‌సాద్ మేన‌త్త‌) గుండెపోటుతో క‌న్నుమూశారు. వ‌రుస మ‌ర‌ణాల‌తో దేవీ శ్రీ ప్ర‌సాద్ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఊహించ‌ని విధంగా వ‌రుస విషాదాలు చోటు చేసుకున్న విష‌యం తెలిసిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

'దేవి' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అయిన డీఎస్పీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ రేసులో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలంటే ముందుగా దేవిశ్రీకే అవకాశాలు వస్తుంటాయి. ప్రస్తుతం దేవి.. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి 'దాక్కో దాక్కో మేక' అనే పాటను విడుదల చేశారు. ఇది యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంతో పాటు ర‌వితేజ నటిస్తోన్న 'ఖిలాడీ' సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Next Story