సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మృతి

Top director KV Anand passes away.ప్రముఖ తమిళ దర్శకుడు, తన చిత్రాల డబ్బింగ్ వర్షన్లతో దక్షిణాదికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2021 3:23 AM GMT
KV Anand

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు, తన చిత్రాల డబ్బింగ్ వర్షన్లతో దక్షిణాదికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ క‌న్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న శుక్ర‌వారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతితో త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. 'తెన్న‌విన్ కోంబ‌త్' అనే మ‌ల‌యాళీ చిత్రంతో సినిమాటోగ్రాఫ‌ర్ 1994లో కె.వి.ఆనంద్ కెరీర్‌ను ప్రారంభించారు. త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, బాలీవుడ్ చిత్రాల‌కు ఆయ‌న సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

'ప్రేమదేశం', 'ఒకే ఒక్కడు', 'శివాజీ' తదితర చిత్రాలకుసినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన, ఆపై 'కణా కండేన్' చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆపై సూర్యతో 'అయాన్' (తెలుగులో వీడొక్కడే) చిత్రానికి దర్శకత్వం వహించి, డైరెక్టర్ గా మారారు. ఆపై జీవా హీరోగా'కో '(తెలుగులో రంగం)తో ఆయన సత్తా ప్రేక్షకులకు తెలిసింది. తరువాత 'మాట్రాన్' (తెలుగులో బ్రదర్స్), 'ఆనేగన్' (తెలుగులో అనేకుడు, 'కాప్పాన్' (బందోబస్త్) సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా.. కెవి ఆనంద్ మృతితో తెలుగు, తమిళ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

కాగా.. ఇటీవ‌లే కోలీవుడ్ చెందిన ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు వివేక్ సైతం గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఇలా ఇద్ద‌రు గొప్ప న‌టులు వెంట వెంట‌నే మృతిచెంద‌డం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.




Next Story