స‌లార్ : రేపు "రాజమన్నార్" రాబోతున్నాడు

Tomorrow Rajamannar character introduction from Salaar Movie.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం స‌లార్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Aug 2021 7:25 AM GMT
స‌లార్ : రేపు రాజమన్నార్ రాబోతున్నాడు

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం స‌లార్. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో కెజియఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కాగా.. ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో నుంచి "రాజమన్నార్" అనే పాత్రను రేపు ఉదయం 10:30 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్ల‌డించింది.

అయితే ఈ చిత్రంలో "రాజమన్నార్" ఎవరో ఊహించడం ప్రారంభించారు. కొంతమంది అది జగపతి బాబు పాత్ర అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు మ‌నోజ్ భాజ్‌పాయ్ అని అంటున్నారు. రేపు చిత్ర బృందం విడుద‌ల చేసేవ‌ర‌కు ఎవ‌రో తెలియ‌దు. ఇక ఈ చిత్ర షూటింగ్‌లో మేజ‌ర్ పార్ట్ పూర్తి అయ్యింది. ప్రభాస్‌పై పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసాడు. ఆ తర్వాత ప్రధాన జంటపై కొన్ని కీలక సన్నివేశాలు పూర్తయ్యాయి. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. ఇక స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 14, 2022 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story