మరోసారి విజయ్ దేవరకొండ హీరోయిన్‌గా రష్మిక..!
రష్మిక చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 12 May 2024 12:23 PM ISTమరోసారి విజయ్ దేవరకొండ హీరోయిన్‌గా రష్మిక..!
రష్మిక మందన్న టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమా తర్వాత ఈ అమ్మడు మరింత బిజీ అయిపోయింది. వరుసపెట్టి సినిమాలకు సైన్ చేసేసింది. ఇదివరకే పుష్ప-2లో నటిస్తోంది నేషనల్ క్రష్. అయితే.. సల్మాన్ ఖాన్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న 'సికిందర్' చిత్రానికి కూడా సైన్ చేసింది. ఈ క్రమంలో రష్మిక చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా మరికొన్ని సినిమాలు క్రష్మిక చేతిలో ఉన్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక పెయిర్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. తాజాగా వీరి స్క్రీన్ రొమాన్స్ మరోసారి రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీకి రష్మిక నటించబోతుందని సమాచారం. 1854-1978 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటన ఆధారంగా రాసుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
రష్మికతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్లు సినిమా ఇండస్ట్రీలో చర్చలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ వార్త నిజమైతే వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా అవుతుంది. ఈ సినిమా అక్టోబరు నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ఈ మధ్యకాలంలోనే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది.