ప్రమోషన్స్‌లో స్టేజ్‌పై స్టెప్పులు.. టాలీవుడ్‌లో నయా ట్రెండ్

కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు స్టార్లు ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటారు.

By Srikanth Gundamalla  Published on  17 Aug 2023 5:25 PM IST
Tollywood, Stage Steps, new trend, Kushi movie,

ప్రమోషన్స్‌లో స్టేజ్‌పై స్టెప్పులు.. టాలీవుడ్‌లో నయా ట్రెండ్ 

కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు స్టార్లు ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటారు. ఎందుకంటే ఎంత బాగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తే.. సినిమా ప్రేక్షకుల మధ్యకు అంత వేగంగా వెళ్తుంది. అయితే.. రెగ్యులర్‌గా కాకుండా కొందరు స్టార్లు ప్రమోషన్స్‌ని కొత్తగా నిర్వహిస్తుంటారు. అందులో మొదటగా వినిపించే పేరు హీరో విజయ్‌ దేవరకొండ. ఆయన ప్రమోషన్స్‌ అంటేనే కొత్తగా యువతను ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే.. విజయ్‌ దేవరకొండ, సమంత జంట వస్తోన్న కొత్త చిత్ర ఖుషీ. ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్‌ పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. సమంత కూడా విజయ్‌ దేవరకొండ స్టేల్‌లోనే ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న 'ఖుషీ' సినిమాలో విజయ్‌, సామ్ కొత్తగా పెళ్లైన జంటగా కనిపించనున్నారు. ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని సాంగ్స్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. సినిమా విడుదల దగ్గరవుతున్న నేపథ్యంలో చిత్రబృందం 'ఖుషీ' మ్యూపజికల్‌ కాన్సర్ట్‌ ఏర్పాటు చేసింది. ఆగస్టు 15న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌ అంతా ఒక ఎత్తు అయితే.. విజయ్‌దేవరకొండ, సమంత డ్యాన్స్‌ మరొక ఎత్తుగా మారింది. 'ఖుషీ' సినిమా టైటిల్‌ సాంగ్‌కు వీరిచ్చిన స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్‌ను తెగ ఎంజాయ్‌ చేసేలా చేశాయి. వీరి డ్యాన్స్‌లో భాగంగా.. సామ్‌ను విజయ్‌ ఒకే చేత్తో ఎత్తుకుని తిప్పడం వైరల్ అయ్యింది. సినిమాలో వీరి కెమిస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు అభిమానులంతా. 'ఖుషీ' సినిమా హిట్‌ కొడుతుందని భావిస్తున్నారు.

టాలీవుడ్‌ మరో హీరో విశ్వక్‌సేన్‌ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మూవీలో విశ్వక్‌సేన్‌ సరసన హీరోయిన్‌గా నేహాశెట్టి నటిస్తోంది. ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌గా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోంది. మునుపెన్నడూ లేని విధంగా విశ్వక్‌సేన్‌ ఈ సినిమాలో రఫ్‌ లుక్‌లో కనిపించనన్నాడు. డిసెంబర్ 8న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. తాజాగా ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసూ కోవే సీరలా' లిరిక్స్‌తో సాగే ఈ పాటను రిలీజ్‌ చేశాక.. హీరోహీరోయిన్లు విశ్వక్‌సేన్, నేహాశెట్టి ఈ పాటకు స్టెప్స్‌ వేశారు. సినిమాలో ఉన్న హుక్‌ స్టెప్‌ను స్టేజ్‌పైనే రీక్రియేట్‌ చేశారు. నేహాశెట్టి, విశ్వక్‌సేన్‌ చేసిన డ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Next Story