'డార్లింగ్స్ వేయిట్‌ చేయండి'.. ఆసక్తి రేపుతోన్న ప్రభాస్‌ పోస్ట్

రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ ఉన్నారు.

By Srikanth Gundamalla
Published on : 17 May 2024 12:20 PM IST

tollywood, prabhas, social media post,

'డార్లింగ్స్ వేయిట్‌ చేయండి'.. ఆసక్తి రేపుతోన్న ప్రభాస్‌ పోస్ట్ 

రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. ప్రభాస్‌ ఇప్పుడు కల్కి కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటుగా మారుతీ డైరెక్షన్‌లో కూడా మరోమూవీ చేస్తున్నాడు. కల్కి మూవీకి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక మారుతీ డైరెక్ట్‌ చేస్తున్న సినిమా హార్రర్, కామెడీగా రాబోతుంది.

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో అంత ఎక్కువగా యాక్టివ్‌గా ఉండరు. అలాంటి వ్యక్తి తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక పోస్టు అందర్లో ఆసక్తి రేపుతోంది. శుక్రవారం ఉదయం పాన్‌ఇండియా స్టార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ఇప్పుడిది టాక్‌ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టిన ప్రభాస్‌ ఇలా రాసుకొచ్చాడు.

'డార్లింగ్స్‌.. చివరగా.. చాలా ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వెయిట్‌ చేయండి..' అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చడు. దాంతో.. ఆయన స్టోరీ చూసిన ప్రతి ఒక్కరూ ఏంటా సర్‌ప్రైజ్‌ అంటూ తెగ ఆసక్తికి కనబరుస్తున్నారు. ప్రభాస్‌ తన వ్యతిగత జీవితానికి సంబంధించి ఏదైనా శుభవార్త చెబుతారా అని చర్చించుకుంటున్నారు. ప్రభాస్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటారనే చర్చ ఎన్నాళ్లుగానో కొనసాగుతోంది. తాజాగా ప్రభాస్‌ పెట్టిన పోస్టు అందర్లోనూ ఆసక్తిని రేపుతోంది.

Next Story