అల్లుడికి నాగబాబు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. అనిల్ రావిపూడికి కరోనా.. తన్మయత్వం చెందిన అనసూయ
Tollywood news today. అల్లుడికి నాగబాబు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. అనిల్ రావిపూడికి కరోనా.. అనసూయ కేరళ టూర్ .
By తోట వంశీ కుమార్ Published on 18 April 2021 11:53 AM ISTమెగా బ్రదర్ నాగబాబు కుమారై నిహారిక గత ఏడాది డిసెంబర్‌లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిహారిక వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుండగా.. తన ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌కు తెలియజేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తన అల్లుడిని సర్‌ప్రైజ్ చేశారు నాగబాబు. ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. కారు డెలివరీ చేస్తున్న ఫొటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
నాగబాబు కూడా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఉగాదికి ఇవ్వాల్సిన కానుక కాస్త లేట్ అయిందని పేర్కొన్నాడు. మా అల్లుడు చెతన్య కు ఇప్పటి వరకూ ఎలాంటి బహుమతులివ్వలేదు. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇటీవల ఉగాదికి ఓ బహుమతి ఇద్దామనుకున్నా.. కుదరలేదు. ఇప్పుడు అతడి కోసం ఓ రేంజ్ రోవర్ డిస్కవరీ కారును తీసుకున్నాం. అని నాగబాబు చెప్పారు.
తన్మయత్వం చెందిన అనసూయ
తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ అనసూయ అంటే తెలియని వారుండరు. బుల్లితెర పై వ్యాఖ్యతగా కొనసాగుతూనే వెండితెరపై తన సత్తాచాటుతోంది. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉన్న అనసూయకు ఇటీవల కాస్త తీరిక దొరికింది. దీంతో అమ్మడు తన ఫ్యామిలీతో కలిసి కేరళ షికారుకు వెళ్లింది. కేరళ అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం చెందుతున్న వీడియోని అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
అనిల్ రావిపూడికి పాజిటివ్..
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా "ఎఫ్ 3" సినిమాను తీస్తున్నాడు. అనిల్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ సినిమా షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది.