రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసుల నోటీసులు
గత కొద్ది రోజులుగా రాజ్‌తరుణ్, లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 July 2024 11:30 AM ISTరాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసుల నోటీసులు
గత కొద్ది రోజులుగా రాజ్‌తరుణ్, లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్ మోసం చేశాడని ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తాజాగా హీరో రాజ్ తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్‌ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
లావణ్య.. రాజ్ తరుణ్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. అలాగే శారీరకంగా కూడా కలిశామని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇప్పుడు వదిలించుకోవాలని రాజ్‌తరుణ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ పేర్కొంది. ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడనీ.. తనని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ లావణ్య పోలీసులకు చేసిన ఫిర్యాదులో చెప్పింది. అలాగే ఆ హీరోయిన్ సోదరుడు కూడా తనను చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. డ్రగ్స్‌లో కేసులోగతంలో ఇరికించారని వాపోయింది. రాజ్ తరుణ్ కోసం 45 రోజులు జైల్లో ఉన్నట్లు లావణ్య వెల్లడించింది. ఈ మేరకు మరికొన్ని విషయాలను కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొంది.
రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ 1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద ముగ్గురిపైనా కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఈ నెల 13న లావణ్య ఆత్మహత్య చేసుకుంటానంటూ లాయర్‌కు మెసేజ్ పంపింది. వెంటనే స్పందించిన పోలీసులు లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా.. రాజ్‌తరుణ్ కావాలనీ.. పెళ్లిచేసుకోవాలని లావణ్య డిమాండ్ చేస్తోంది.