రాయదుర్గం పోలీసులకు ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు

టాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ పోలీసులను ఆశ్రయించారు.

By Srikanth Gundamalla  Published on  27 Sept 2024 4:12 PM IST
రాయదుర్గం పోలీసులకు ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు

టాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ పోలీసులను ఆశ్రయించారు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆయన.. ఫిర్యాదు చేశారు. తన తనయుడు వైష్ణవ్‌ ను ర్యాగింగ్ చేస్తూ చెవి కూడా కొరికేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. ఓ ప్రయివేట్ కాలేజీలో ఆర్పీ పట్నాయక్ కుమారుడు వైష్ణవ్ ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థి శ్యామ్ బస్సులో వైష్ణవ్ తో గొడవ పడ్డాడని.. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని తెలిసింది. దాంతో.. ఆవేశంలో శ్యామ్‌.. వైష్ణవ్ చెవిని కొరికేశాడని సమాచారం.

గురువారం ఈ సంఘటన జరగ్గా.. ఆర్పీ పట్నాయక్‌ అదే రోజు రాత్రి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్పీ పట్నాయక్‌పై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story