మురారీ రీ-రిలీజ్‌తో ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్ చేసిన మహేశ్‌బాబు

మహేశ్‌ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9వ తేదీన మురారీ సినిమాను రీరిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2024 9:00 AM IST
Tollywood, Mahesh babu, murari movie, re-release, record

 మురారీ రీ-రిలీజ్‌తో ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్ చేసిన మహేశ్‌బాబు

సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9వ తేదీన మురారీ సినిమాను రీరిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మహేశ్‌ బాబు సినిమా థియేటర్లలో ఆడటంతో ఫ్యాన్స్‌ తెగ వెళ్లారు. ఈ క్రమంలోనే మురారీ రీరిలీజ్‌ అయ్యి కొత్త రికార్డును నెలకొల్పింది. రీ రిలీజ్‌లో కూడా మహేశ్‌బాబు మురారీ మూవీ భారీ కలెక్షన్లను రాబట్టింది. థియేటర్లంతా హౌస్‌ఫుల్‌ బోర్డులతో దర్శనం ఇస్తున్నాయి.

మహేశ్‌బాబు మురారీ మూవీ రీరిలీజ్‌లో ఓవ‌ర్సీస్‌లో దుమ్ములేపిన‌ట్లు తెలుస్తుంది. అమెరికాలో రీ రిలీజ్ చేసిన సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన మూడో చిత్రంగా మురారి నిలిచింది. ఎన్టీఆర్ న‌టించిన సింహాద్రి చిత్రం మొద‌టి స్థానంలో ఉంది. ఇక మురారి రీ రిలీజ్ క‌లెక్ష‌న్లు చూసుకుంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 5.5 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా చూసుకుంటే రీ రిలీజ్ క‌లెక్ష‌న్స్‌లో ఖుషి టాప్ ప్లేస్‌లో ఉండ‌గా.. బిజినెస్‌మాన్ రెండో స్థానంలో ఉంది. మురారి మూడోస్థానంలో నిలిచింది.

మురారీ సినిమా టాలీవుడ్ నుంచి వ‌చ్చిన‌ ఆల్ టైం క్లాసిక్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. పెళ్లి గురించి ఉన్న పాటలు.. సీన్స్‌ ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉండిపోయాయి. మ‌హేశ్ కెరీర్‌లో గుర్తుండిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో ఒక‌టి మురారి. టాలీవుడ్ క్లాసిక‌ల్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రంలో మ‌హేశ్‌, సోనాలి బింద్రే హీరో హీరోయిన్‌లుగా న‌టించారు. 2001లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.



Next Story