నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత అరుదైన ఘనత
టాలీవుడ్‌లో ఇటీవల హీరో హీరోయిన్ పెళ్లికి సిద్ధం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 11:30 AM ISTనాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత అరుదైన ఘనత
టాలీవుడ్‌లో ఇటీవల హీరో హీరోయిన్ పెళ్లికి సిద్ధం అయ్యారు. అదే అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నాళ్లుగా వీరి వివాహం గురించి వార్తలు వచ్చినా.. క్లారిటీ లేదు. ఒకేసారి ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో చాలా వరకు షాక్ అయ్యారు. అయితే.. చైతూతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత ధూళిపాళ్ల అరుదైన ఘనత సాధించారు. ఆమె గురించి తెలుసుకునేందకు నెటిజన్లు గూగుల్‌లో చాలా ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ వారం ఐఎంబీడీ ఇండియన్ పాప్యులర్ సెలబ్రిటీల జాబితాలో ఒక్కసారిగా టాప్‌లోకి వచ్చారు. ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచారు.
మోస్ట్ సెర్చ్ సెలబ్రిటీస్ జాబితాలో తొలి స్థానంలో బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ ఉన్నారు. ముంజ్యా మూవీ విజయంతో ఆమెకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రెండో స్థానంలో శోభిత ధూళిపాళ్ల ఉండగా.. మూడో స్థానంలో షారుక్‌ఖాన్ ఉన్నారు. కింగ్ ఖాన్ తర్వాత నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా కాజోల్, జాన్వీ కపూర్ ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, 'మహారాజ'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ టాప్-10లో చోటు సంపాదించుకున్నారు.