అందుకే రెమ్యునరేషన్ పెంచా.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రసన్నవదనం సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా హీరో సుహాస్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 4:00 PM GMTఅందుకే రెమ్యునరేషన్ పెంచా.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చిన్న సినిమాల్లో చిన్న పాత్రలు చేసి హీరోలు అయినవారూ ఉన్నారు. అయితే.. ఆ కోవాలోకే వచ్చిన హీరోనే సుహాస్. ఇప్పుడు భిన్నరకమైన స్టోరీలతో సినిమాలు తీస్తూ వరుసగా హిట్స్ సాధిస్తున్నాడు. సక్సెస్ అనే పదానికి నిర్వచనంలా మారాడు. సుహాస్ ఇటీవల నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు కూడా మంచి హిట్‌గా నిలిచింది. దాంతో.. మరో సక్సెస్‌ను సుహాస్ తన ఖాతాలో వేసుకున్నారు. సుహాస్ మరో సినిమా కూడా తీస్తున్నాడు. అదే ప్రసన్నవదనం. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించగా.. ఇందులో సుహాస్‌ను పలువురు ప్రశ్నలు అడగడంతో ఆయన ఇంట్రెస్టింగ్‌గా సమాధానాలు చెప్పారు.
నటులు అనగానే మొదట గుర్తొచ్చేది వారి రెమ్యుననరేషన్ ఎంతో అనుకుంటాం కదా. ఇదే ప్రశ్నను సుహాస్‌ను అడిగారు. రెమ్యునరేష్ మూడు వేల నుంచి మూడు కోట్ల రూపాయలకు పెంచారటగా అడగ్గా.. దానికి స్పందించిన సుహాస్.. పారితోషికం పెంచాలి కదా అన్నారు. తాను బతకాలి కదా అన్నట్లు చెప్పారు. జూనియర్ ఆర్టిస్టుగా రోజుకు వంద రూపాయలు తీసుకున్న స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చానని సుహాస్ చెప్పాడు. తనకు ఎంతో కొంత తీసుకోవాలని ఉంటుందని చెప్పాడు. కాకపోతే మరీ ఎక్కువేం కాదంటూ సమాధానం ఇచ్చాడు సుహాస్. కొత్త దర్శకులకు ఎక్కువగా చాన్స్‌లు ఇస్తున్నారు.. దానికి కారణమేంటన్న ప్రశ్నకు.. ఎవరైనా మొదటి సినిమాను ప్రేమించినట్లుగా తర్వాతి సినిమాను ప్రేమించలేరని అన్నారు. అందుకే చాలా వరకు కొత్తవారితో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తాని సుహాస్ పేర్కొన్నాడు.
కొత్తగా వచ్చే హీరోలకు ఏదైనా సందేశం ఇస్తారా అనే ప్రశ్నకు.. నా బతుకేంటో నాకే అర్థం కావడం లేదు.. నీ భవిష్యత్తు ఎవడికి కావాలి అనే ఓ డైలాగ్‌ను గుర్తు చేశాడు సహార్. తన పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాడు. తాను ఎప్పుడూ హీరో అవుతానని అనుకోలేదని చెప్పాడు. అంతా ఓ కలలాగా ఉందన్నాడు. ఎవరైనా హీరో అంటున్నా కొత్తగా ఉందంటూ నవ్వుతూ ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పాడు హీరో సుహాస్.