'డబుల్‌ ఇస్మార్ట్‌' టీజర్‌పై చిత్ర యూనిట్‌ కీలక ప్రకటన

ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీక్వెల్స్‌ ట్రెండ్ నడుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  14 May 2024 2:24 PM IST
Tollywood, hero ram, double ismart movie, teaser,

'డబుల్‌ ఇస్మార్ట్‌' టీజర్‌పై చిత్ర యూనిట్‌ కీలక ప్రకటన 

ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీక్వెల్స్‌ ట్రెండ్ నడుస్తోంది. డీజే టిల్లు.. దేవర, పుష్పతో పాటు చాలా సినిమాలు రెండు పార్ట్‌లుగా వస్తున్నాయి. అయితే.. గతంలో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పొతినేని నటించిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి మంచి వసూళ్లను రాబట్టింది. అయితే.. ఈ మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ 'డబుల్ ఇస్మార్ట్‌' సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన చిత్ర యూనిట్ కీలక అప్‌డేట్‌ను ఇచ్చింది.

టాలీవుడ్‌ ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ టీజర్ మే 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. దిమాక్కిరికిరి డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్‌ లోడింగ్.. డబుల్‌ ఎక్స్‌ మ్యాడ్‌నెస్‌ డోస్‌ 85 సెకన్లు అంంటూ కొత్త లుక్‌ను చిత్ర యూనిట్‌ షేర్ చేసింది. రామ్‌ పొతినేని గాగుల్స్‌ పట్టుకుని, భుజంపై గన్‌ పెట్టుకుని ధమ్‌కీ ఇస్తున్నట్లుగా ఈ లుక్‌లో కనబడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎనర్జిటిక్‌ స్టార్ మరోసారి రచ్చ చేయడం పక్కా అంటున్నారు అభిమానులు.

కాగా. ఈ మూవీలో బాలీవుడ్‌ యాక్టర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్‌ పార్ట్‌కు మంచి పాటల్.. మ్యూజిక్‌ అందించిన మణిశర్మ.. అదిరిపోయే బీజీఎం రెడీ చేసినట్లు చెబుతోంది చిత్ర యూనిట్. వరల్డ్‌ వైడ్‌గా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో టీజర్‌ను విడుదల చేస్తారు. ఇక సినిమా విడుదల తేదీకి సంబంధించి త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటన చేయనున్ట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్‌ ఈజ్ బ్యాక్‌.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్‌.. అంటూ పూరీ టీం ఇప్పటికే శక్తిమంతమైన త్రిశూలంతో డిజైన్ చేసిన పోస్టర్ షేర్ చేసి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. అదరిపోయే పూరీ డైలాగ్స్‌.. రామ్‌ ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో గతంలో క్రియేట్‌ చేసిన సెన్షేషన్ మరోసారి రిపీట్‌ కాబోతుందని సినిమా ప్రేక్షకులు అంటున్నారు.


Next Story