తన సినిమా హీరోయిన్‌నే పెళ్లాడబోతున్న కిరణ్ అబ్బవరం..!
టాలీవుడ్ లో చిన్న సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం.
By Srikanth Gundamalla
తన సినిమా హీరోయిన్‌నే పెళ్లాడబోతున్న కిరణ్ అబ్బవరం..!
టాలీవుడ్ లో చిన్న సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం. ఆయన ఎంపిక చేసే కథలు.. యాక్టింగ్‌తో ప్రత్యేకమైన స్టార్‌డమ్ ఏర్పరుచుకున్నారు. కిరణ్ అబ్బవరం పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఆయన ఫస్ట్ సినిమా హీరోయిన్‌నే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగులో నటుడిగా అరంగేట్రం చేశాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత అతను నటించిన ఎస్‌ఆర్ కల్యాణమండపం సినిమా మంచి హిట్‌గా నిలిచింది. కిరణ్ అబ్బవరం ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు తీశాడు. కొన్ని యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా.. కొన్ని మిక్స్‌డ్‌గా నిలిచాయి. కానీ.. ఈ యంగ్ హీరో మాత్రం వరుసపెట్టి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అయితే.. తాజాగా కిరణ్ అబ్బవరం తన పెళ్లి గురించి సెన్షేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన తొలి సినిమా హీరోయిన్ రహస్యను కిరణ్ అబ్బవరం పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అప్పుడప్పుడు వీరు బయట కనిపించేవారు. కానీ.. ఎప్పుడూ ప్రేమ విషయాన్ని బయటపెట్టలేదు. కిరణ్ అబ్బవరం ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గానే ఉంచాడు.
తన ఫస్ట్ హీరోయిన్ రహస్యను కిరణ్ పెళ్లాడబోతున్నట్లు తెలియడంతో అభిమానులు కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ నెల 17న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత పెళ్లి గురించి అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాగా.. కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతను 'దిల్ రూబా' సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు.