మళ్లీ రిపీట్ కాదు.. క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున

అభిమాన హీరో కనబడితే చాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

By Srikanth Gundamalla
Published on : 24 Jun 2024 8:47 AM IST

tollywood, hero akkineni nagarjuna,  sorry,

మళ్లీ రిపీట్ కాదు.. క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున

అభిమాన హీరో కనబడితే చాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంకొందరు వారిని కలిసేందుకు ఎన్నో విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్క సెల్ఫీ తీసుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. ఈక్రమంలో ఈ అదృష్టం కొందరిని వరిస్తే.. ఇంకొందరికి కలగానే మిగిలిపోతుంది. అయితే.. కొన్నిసార్లు సెలబ్రిటీలను కూడా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇంకొన్నిసార్లు అభిమానులకూ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా టాలీవుడ్‌ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఫ్యాన్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎయిర్‌పోర్టు నుంచి హీరో నాగార్జున బయటకు వస్తున్నారు. అది చూసిన ఒక అభిమాని నాగార్జునతో ఫొటో తీసుకోవాలని అనుకున్నాడు. దాంతో.. దగ్గరకు రాగానే ఫోన్ పట్టుకుని నాగ్‌ దగ్గరకు వెళ్లాడు. కానీ.. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించాడు. అతన్ని బలంగా పక్కకు లాగి.. నెట్టేశాడు. దాంతో.. అతను కిందపడిపోయినంత పని అయ్యింది. అయితే.. హీరో నాగార్జున ఇది గమనించినట్లు లేదు. హడావుడిగా ముందుకు సాగిపోయారు.

అయితే.. తర్వాత సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన హీరో నాగార్జున.. ఎక్స్‌లో వీడియోను రీపోస్టు చేస్తూ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు గమనించలేదని చెప్పుకొచ్చారు. తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని నాగార్జున ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇలాంటిది జరిగి ఉండాల్సి కాదని అన్నారు. సదురు వ్యక్తిని తాను క్షమాపణలు చెబుతున్నా అంటూ హీరో నాగార్జున ఎక్స్‌లో రాసుకొచ్చారు. మళ్లీ ఇలాంటిది జరగుండా తగిన చర్యలు తీసుకుంటాను అంటూ హీరో నాగార్జున ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు, నాగార్జున అభిమానులు.. ఆయన మంచితనాన్ని అభినందిస్తున్నారు.

Next Story