హనుమాన్‌ మేనియా.. నాలుగు రోజుల్లో సూపర్‌ కలెక్షన్స్

సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్‌ మూవీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  16 Jan 2024 2:30 PM IST
tollywood, hanuman movie, prasanth varma,

 హనుమాన్‌ మేనియా.. నాలుగు రోజుల్లో సూపర్‌ కలెక్షన్స్

సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన సినిమా హనుమాన్. విజువల్స్‌.. మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడంతా హనుమేనియా నడుస్తోంది. ముందుగా కాస్త తక్కువ థియేటర్లలోనే విడుదలైన సినిమా.. ఇప్పుడు పబ్లిక్ డిమాండ్‌తో ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శింపబడుతోంది. విడుదలైన అన్ని చోట్లా భారీగా వసూళ్లను రాబడుతోంది. హనుమాన్ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లో కలెక్షన్లు సుమారు వంద కోట్లకు చేరువ అవుతోంది.

సంక్రాంతి సందర్భంగా స్టార్‌ హీరోల సినిమాలు విడుదలైనా.. పోటీ పడి మరీ రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతున్నాడు హనుమాన్. జనవరి 12న విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లో ర.100 కోట్లకు చేరువ అయ్యింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ను అధిగమించింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లన్నీ లాభాల కిందకే. ప్రశాంత్‌ వర్మను నెటిజన్లు.. సినిమా ప్రేక్షకులు తెగ మెచ్చుకుంటున్నారు. అతడి డైరెక్షన్‌ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన సినిమాను రూపొందించి తెలుగువాడి సత్తా చూపించాడని పొగుడుతున్నారు.

కాగా.. హనుమాన్‌ మూవీలో తేజ సజ్జా హీరోయిన్‌గా నటించాడు. అమృతా అయ్యర్‌ కథానాయికగా నటించగా.. తేజకు అక్కగా వరలక్ష్మీ శరత్ కుమార్‌ నటించింది. వినయ్‌ రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రదర్శితం అవుతోన్న థియేటర్లలో టికెట్లు దొరకడం లేదు. రోజుకు రోజుకు ఈ సినిమా డిమాండ్‌ పెరిగిపోయింది. నాలుగో రోజైన సోమవారం జనవరి 15న హనుమాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.11 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు కంటే ఎకకువగా రాబడుతోంది. మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హనుమాన్.. నాలుగో రోజు మరో రూ.24 కోట్లతో మొత్తంగా రూ.97 కోట్ల గ్రాస్ సాధించింది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. అక్కడ 4 రోజుల్లో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.


Next Story