సడెన్‌గా ఓటీటీలోకి ఆనంద్ దేవరకొండ సినిమా
యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి గత నెల 31న విడుదల అయ్యింది.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 1:45 PM ISTసడెన్‌గా ఓటీటీలోకి ఆనంద్ దేవరకొండ సినిమా
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. బేబీ సినిమాతో తన కెరియర్‌లోనే పెద్ద హిట్‌ను అందుకున్నాడు. అంతకుముందు తీసిన సినిమాలు కూడా ఫర్వాలేదనిపించాయి. ఇక ఇటీవల కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టితో కలిసి గం గం గణేషా అనే సినిమ తీశాడు. ఇందులో ఆనంద్ పక్కన హీరోయిన్‌గా ప్రగతి శ్రీవాస్తవ నటించింది. యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి గత నెల 31న విడుదల అయ్యింది. అయితే.. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇచ్చారు. మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఇక ఇప్పుడు థియేటర్ రన్ అయిపోవడంతో ఓటీటీలో విడుదల చేశారు. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో కూడా కొన్ని సినిమాలో ఇలానే ఓటీటీలోకి వచ్చేశాయి. తాజాగా గం గం గణేశ రావడంతో.. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో చూసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఈ మూవీ కథ విషయానికి వస్తే.. గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఒక దొంగపాత్రలో కనిపిస్తాడు. అతని ఫ్రెండ్ (ఇమాన్యుయెల్)తో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటాడు. శృతి(నయన్ సారిక)తో గణేశ్ ప్రేమలో పడతాడు. ఆమె గణేశ్‌తో కాకుండా మరో వ్యక్తితోపెళ్లికి రెడీ అవుతోంది. దాంతో.. గణేష్ మనస్తాపంతో ఆఅమ్మాయిని గెలవడానికి డబ్బు ముఖ్యం అని ఫిక్స్ అయి డైమండ్ చోరికి సిద్ధం అవుతాడు. డైమండ్‌ను దొంగతనం చేశాడా? గణేశ్ ఎలాంటి సమస్యల్లో పడ్డాడు? చివరకు శృతిని పెళ్లి చేసుకున్నాడా? అనేది మిగతా స్టోరీ.