ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన సినీ ప్ర‌ముఖులు

Tollywood celebrities Ugadi wishes to fans.శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఆరంభం సందర్భంగా ప్ర‌తి ఒక్క‌రికీ అన్నీ శుభాలే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2022 5:59 AM GMT
ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన సినీ ప్ర‌ముఖులు

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఆరంభం సందర్భంగా ప్ర‌తి ఒక్క‌రికీ అన్నీ శుభాలే జ‌ర‌గాల‌ని మెగాస్టార్ చిరంజీవి కోరుకున్నారు. ఉగాది పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సోష‌ల్ మీడియా వేదిక‌గా అంద‌రికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్ రామ్, రామ్ పోతినేని సహా పలువురు సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం (ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు.

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు- ఎన్టీఆర్‌

ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు- నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్

శుభకృత నామ సంవత్సరం మన అందరికీ సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు- శ్రీను వైట్ల‌
Next Story