సీఎం జగన్‌తో సినీ ప్రముఖలు భేటీ ప్రారంభం
Tollywood celebrities meets AP CM Jagan.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2022 1:04 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, పోసాని కృష్ణమురళీ, అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటిలో సినిమా టికెట్ల రేట్లు, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్దిపై చర్చించనున్నారు.
ప్రధానంగా జీవో నంబరు 35లో సవరణలకు సంబంధించి చర్చించనున్నారు. సినిమా థియేటర్లలో టికెట్ ధర పెంపు, ఏసీ నాన్ ఏసీ థియేటర్లలో కనిష్ట, గరిష్ట టికెట్ ధరల పెంపు, థియేటర్ల వర్గీకరణ, వాటిల్లో స్నాక్స్ అమ్మకాల ధరలు వంటి అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీ వేయగా.. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను అందజేసింది.
ఒకే విమానంలో..
ముఖ్యమంత్రి జగన్‌తో భేటికి ఎవరెవరు వస్తున్నారో తనకు తెలియదని.. తనకు మాత్రం ఆహ్వానం అందిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పినప్పటికీ.. అందరూ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. ఇక విమానంలో మహేష్‌కు చిరంజీవి పుష్పగుచ్చం అందజేశారు. ఈ రోజు మహేశ్-నమత్ర వివాహ వారికోత్సవం సందర్భంగా మహేశ్‌కు శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. ఇక విజయవాడకు చేరుకున్నటాలీవుడ్ బృందం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. చిరంజీవితో పాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ, నటుడు అలీ, నారాయణ మూర్తి సీఎం జగన్ తో భేటీ అయ్యారు.