ల‌త గానం స‌జీవం.. టాలీవుడ్ ప్ర‌ముఖుల నివాళి

Tollywood celebrities condolence on Lata Mangeshkar Death.ప్ర‌ముఖ గాయ‌ని, భార‌త‌ర‌త్న పుర‌స్కార గ్ర‌హీత‌, గాన‌కోకిల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2022 12:23 PM IST
ల‌త గానం స‌జీవం.. టాలీవుడ్ ప్ర‌ముఖుల నివాళి

ప్ర‌ముఖ గాయ‌ని, భార‌త‌ర‌త్న పుర‌స్కార గ్ర‌హీత‌, గాన‌కోకిల ల‌త మంగేష్క‌ర్ క‌న్నుమూశారు. 29 రోజులు పాటు ఆస్ప‌త్రిలో మృత్యువుతో పోరాడి చివ‌ర‌కు ఆదివారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆమె వ‌య‌స్సు 92 సంవ‌త్స‌రాలు. దేశ‌, విదేశీల‌లో క‌లిపి దాదాపు 20 బాష‌ల్లో 50 వేల‌కు పైగా పాట‌లు పాడారు. ఆమె ఇక లేర‌నే వార్త‌తో సినీ సంగీత అభిమానులు శోక సంక్రంలో మునిగిపోయారు. ఆమె మృతి ప‌ట్ల ప‌లువ‌రు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా నివాళులు అర్పిస్తున్నారు.

'భారత సినీ గానకోకిల, ది గ్రేటెస్ట్ లెజెండ్ లతా మంగేష్కర్ ఇక లేరు. నిజంగా ఇది గుండెబద్దలయ్యే వార్త. ఆవిడ లేని లోటు తీర్చలేనిది. ఆమె అసాధారణమైన జీవితం గడిపారు. ఆవిడ గానం సజీవం. సంగీతం ఉన్నంత వరకూ ఆ గాన మాధుర్యం ఎన్నటికీ నిలిచే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'- చిరంజీవి

'గానకోకిల లతా మంగేష్కర్ చనిపోయారనే గుండెపగిలే వార్త తెలిసింది. ఎందరికో లతాగారు స్ఫూర్తి. ఆవిడలేని లోటు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది' - వెంకటేశ్

ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల మ‌హేశ్ బాబు సంతాపం తెలిపారు. లతా మంగేష్కర్‌గారి మృతి వార్త తెలుసుకుని బాధప‌డ్డాన‌ని తెలిపారు. ఆమె కుటుం స‌భ్యులకు సానుభూతి తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

భార‌త ర‌త్న ల‌తా మంగేష్క‌ర్ మృతిపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ల‌త లేని లోటు పూడ్చ‌లేద‌ని. భార‌త గాన కోకిల‌కు నివాళులు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడి ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

భార‌త గాన‌కోకిల మూగ‌బోయింది. సంగీత ప్ర‌పంచానికి ల‌త చేసిన సేవ ఎప్ప‌టికీ నిలిచి ఉంటుంది. ల‌తా మంగేష్క‌ర్ పాట ద్వారా చాలా భావోద్వేగాల‌కు కార‌ణ‌మ‌య్యారు. మీరు మా హృద‌యాల్లో ఎప్ప‌టికీ నిలిచి ఉంటారు. ల‌త దేశానికి దొరికిన గొప్ప సంప‌ద - పూజా హెగ్డే

Next Story