డైరెక్టర్ త్రివిక్రమ్‌పై మరోసారి పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 11 July 2024 4:13 PM ISTడైరెక్టర్ త్రివిక్రమ్‌పై మరోసారి పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో త్రివిక్రమ్‌పై విరుచుకుపడ్డారు. మరోసారి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చిన్నపిల్లలపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ వీడియో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆయన్ని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇలాంటి కామెంట్స్‌పై సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. చిన్న పిల్లలతో పాటు ఆడపిల్లలపై ఇలాంటి కామెంట్స్ కొత్తేమి కాదని ఇంతకుముందు తెలుగు హీరోలు కూడా ఇలా చేశారని అన్నారు. ఇందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా ప్రస్తావనకు వచ్చింది.
జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ కు ఒక డైలా ఉంటుంది. పడుకొని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఆనందం ఏముంటుందనీ.. పరిగెత్తించి పరుగెత్తించి చేయాలని డైలాగ్ త్రివిక్రమ్ రాయించారని అన్నారు నటి పూనమ్ కౌర్ . ఇంతకన్న మంచి డైలాగ్స్ త్రివిక్రమ్ గురించి ఆశించడం తప్పే అవుతుందని పూనమ్ కౌర్ అన్నారు. దీనికి ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. త్రివిక్రమ్‌పై పూనమ్‌కు ఉన్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో తెలిపి అందరినీ తప్పుదోవ పట్టించొదన్నారు. ఆయన టాలెంట్ ఏంటన్నది టాలీవుడ్ మొత్తం తెలుసని వ్యాఖ్యానించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపైనా పూనమ్ కౌర్ స్పందించింది. అతనికి కౌంటర్ ఇచ్చింది. మగవారి ఈగో కోసం ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారనీ తెలుసనీ పేర్కొంది. నీవు నీ అనుభవంతో మాట్లాడితే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నట్లు కౌంటర్ ఇచ్చింది పూనమ్ కౌర్. త్రివిక్రమ్ ఇతరుల జీవితాలను నావనం చేస్తారంది. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో.. వేరేవాళ్లతో ఏం చేయించాడో ఆయన్నే అడగండంటూ నటి పూనమ్ కౌర్ మండిపడింది.