ఎలాంటి టెస్టులకైనా రెడీ.. నటి హేమ మరో వీడియో
కొన్నాళ్ల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 5:34 PM ISTఎలాంటి టెస్టులకైనా రెడీ.. నటి హేమ మరో వీడియో
కొన్నాళ్ల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న దాదాపు 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని బెంగళూరు పోలీసులు చెప్పారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారని చెప్పారు. అంతకుముందు ఆమె తప్పదోవ పట్టించేలా కొన్ని వీడియోలు పెట్టారు. తాను పార్టీలోనే లేననీ.. హైదరాబాద్‌లో ఉన్నానంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. చివరకు ఆమె ఆధారాలతో బెంగళూరులో ఉన్నారని పోలీసులు చెప్పారు. చివరకు రెండు సార్లు ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. కానీ.. ఆమె ఎంతకు రాకపోవడంతో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. చివరకు బెయిల్‌పై నటి హేమ బయటకు వచ్చారు.
ఈ క్రమంలో బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసు గురించి నటి హేమ తాజాగా మరో వీడియోను విడుదలచేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికి అయినా సిద్ధమని చెప్పారు. తాను ఇప్పటికే హెయిర్, నెయిల్స్ తో పాటు ఇతర టెస్టులు చేయించాననీ.. అందులో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందంటూ ఆధారం చూపించారు. అయితే.. ఈ వీడియో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసమే చేస్తున్నట్లు నటి హేమ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రగ్స్ తీసుకుందని పోలీసులు చెబుతుంటే.. ఆమె మాత్రం రుజువులంటూ వీడియో చేయడం సవాల్ చేసినట్లు ఉంది. మరి పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.