బిగ్‌బాస్ ఫేమ్‌ సోహైల్‌ ఇంట్లో తీవ్ర విషాదం

రియాలిటీ షో బిగ్ బాస్ ఫేమ్, హీరో సోహైల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  17 Sept 2024 8:30 PM IST
బిగ్‌బాస్ ఫేమ్‌ సోహైల్‌ ఇంట్లో తీవ్ర విషాదం

రియాలిటీ షో బిగ్ బాస్ ఫేమ్, హీరో సోహైల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోహైల్ తల్లి మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.

కాగా.. హీరో సోహైల్ కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయనకు తండ్రి సయ్యద్ సలీం, తల్లి, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. సోహైల్ తల్లి ఫైమాసుల్తానా. ఈమె గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. డయాలసిస్ నిమిత్తం మెడికవర్ హాస్పిటల్ లో జాయిన్ అయిన ఫైమా సుల్తానా పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. దీంతో సోహైల్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని స్వస్థలం కరీంనగర్ తరలిస్తున్నారు.

కాగా.. 'కొత్త బంగారులోకం' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సోహైల్ 'బిగ్ బాస్-4' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. 'లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు' వంటి వరుస సినిమాలతో హీరోగా నటించాడు సోహైల్.

Next Story