ఒక్కటైన నరేష్, పవిత్ర.. పెళ్లి వీడియో ఇదిగో.!

గత కొన్నాళ్లుగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్న టాలీవుడ్‌ నటుడు నరేష్‌, నటి పవిత్ర లోకేష్‌.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

By అంజి  Published on  10 March 2023 11:56 AM IST
actor Naresh, actress Pavitra

 ఒక్కటైన నరేష్, పవిత్ర.. పెళ్లి వీడియో ఇదిగో

గత కొన్నాళ్లుగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్న టాలీవుడ్‌ నటుడు నరేష్‌, నటి పవిత్ర లోకేష్‌.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. హైదరాబాద్‌కు దూరంగా ఓ గుడిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. కాగా సోషల్‌మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను నరేష్‌ రిలీజ్‌ చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. సంప్రదాయబద్దంగా మూడుముళ్లు ఏడడుగులు వేసిన జంట.. అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు.

ఈ టాలీవుడ్‌ సీనియర్‌ జంట.. ఇప్పుడు అధికారికంగా దంపతులుగా మారారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రారంభాలు అని.. అందరి ఆశీస్సులు కావాలంటూ తమ రిలేషన్ గురించి అఫీషియల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 'త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం' అంటూ తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. అయితే గతంలో నరేష్ పవిత్ర.. తమ రిలేషన్ పై బహిర్గంగానే కామెంట్ చేశారు. మేమిద్దరం కలిసి ఉంటున్నామని, పెళ్లి చేసుకోలేదని, తమని సపోర్ట్ చేయాలని చెప్పుకొచ్చారు. నరేష్‌కు ఇది నాలుగో పెళ్లి కాగా, పవిత్రకు కూడా మరో వివాహం.

కాగా వీరిపై వస్తున్న రూమర్లకు.. ఈ పెళ్లితో అధికారికంగా చెక్ పెట్టినట్లయింది. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, ఏడడుగు, మూడు ముళ్లు అంటూ నరేష్ ట్వీట్ చేశారు. కానీ తన మూడో భార్య రమ్య నుంచి నరేష్ విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే పెళ్లి ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. గత కొన్నేళ్లుగా నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంపై మీడియాలో జోరుగా కథనాలు వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై నటుడు నరేష్ వేసిన పరువు నష్టం దావా కూడా వేశారు. ఇటు పవిత్ర కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story