త్వరలో హీరో నాగశౌర్య పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?

Tollywood actor Naga Shaurya is getting married soon. టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరిగా పరిగణించబడుతున్న హ్యాండ్సమ్ హంక్ నాగ శౌర్య.

By అంజి  Published on  10 Nov 2022 6:02 PM IST
త్వరలో హీరో నాగశౌర్య పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరిగా పరిగణించబడుతున్న హ్యాండ్సమ్ హంక్ నాగ శౌర్య.. ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అవును, మీరు చదివింది నిజమే. నాగశౌర్య బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన తన ప్రియురాలు అనూషా శెట్టిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నవంబర్ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్‌లో నాగ శౌర్య, అనూష వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నవంబరు 19న వివాహానికి ముందు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

ఈ జంట పెళ్లి వేడుక సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరగనుంది. ఈ జంట పెళ్లి ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగశౌర్య బృందం సోషల్‌ మీడియాలో పెళ్లి వార్తను పంచుకుంది. "పెళ్లి గంటలు మోగుతున్నాయి. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకలు నవంబర్ 19న ప్రారంభమవుతాయని, ఆ తర్వాత మెహందీ ఈవెంట్ జరుగుతుందని సమాచారం. నాగశౌర్య త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని గతంలో పలు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, నటుడు వాటన్నింటినీ ట్రాష్ చేశాడు. ఇప్పుడు నాగశౌర్య ఎట్టకేలకు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

నాగ శౌర్య చివరిగా 'కృష్ణ బృందా విహారి' సినిమాలో కనిపించాడు. ఇక ఇటీవలే నాగశౌర్య తన 24వ సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎస్‌ఎస్ అరుణాచలం చేస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ ట్యూన్ చేస్తున్నట్లు నిన్న మేకర్స్ ప్రకటించారు.

Next Story