హాలీవుడ్ న‌టుడు డేవిడ్ వార్నర్ క‌న్నుమూత‌

Titanic actor David Warner dies at 80 from cancer related illness.సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 26 July 2022 11:04 AM IST

హాలీవుడ్ న‌టుడు డేవిడ్ వార్నర్ క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు డేవిడ్ వార్న‌ర్ క‌న్నుమూశాడు. గ‌త కొంత కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆదివారం తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలియ‌జేశారు. ఆయ‌న వ‌య‌స్సు 80 సంవ‌త్స‌రాలు.

వార్నర్ 'టైటానిక్' చిత్రంలో బిల్లీ జేన్ సైడ్‌కిక్ స్పైసర్ లవ్‌జాయ్‌గా నటించాడు. లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్‌లో శిక్షణ పొందిన వార్నర్, కింగ్ హెన్రీ VI,కింగ్ రిచర్డ్ II వంటి పాత్రలను పోషించి, రాయల్ షేక్స్‌పియర్ కంపెనీకి స్టార్ అయ్యాడు. పీటర్ హాల్ దర్శకత్వం వహించిన 1965లో హామ్లెట్ టైటిల్ రోల్‌లో డేవిడ్ వార్నర్ తన అద్భుత నటనతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. అలాగే 'ది ఒమెన్', 'ట్రాన్' వంటి చిత్రాలలో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నాడు. వార్న‌ర్ ఇక లేరు అన్న వార్త విన్న హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Next Story