ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న టిక్ టాక్ భార్గవ్ ఘనకార్యాలు
Tik tok bhargav ex girlfriend shocking revelations about him.చాలా మంది అమ్మాయిలతో భార్గవ్ అభ్యంతకరంగా ప్రవర్తించాడనే వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 22 April 2021 12:26 PM GMT
టిక్ టాక్ భార్గవ్ మైనర్ అమ్మాయిపై చేసిన దారుణం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నారు. చాలా మంది అమ్మాయిలతో భార్గవ్ అభ్యంతకరంగా ప్రవర్తించాడనే వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. అతడితో పని చేసిన అమ్మాయిలు కూడా తాము అతడితో ఉన్నప్పుడు సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదని చెబుతున్నారు. అతడితో పని చేసిన అమ్మాయిల వల్లే భార్గవ్‌కు పేరుప్రఖ్యాతులు రాగా.. వాళ్లను కొంచెం కూడా గౌరవించడని భార్గవ్ తో కలిసి టిక్ టాక్ వీడియోలు చేసిన యువతి తెలిపింది.
అతడో పెద్ద వుమెనైజర్ అనే విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉంది, సౌత్ ఇండియా సూపర్ స్టార్.. అనే ఊహలో అతడు బతుకుతూ ఉండేవాడని కూడా ఆమె చెప్పింది. పని వర్కవుట్ అవకపోతే సెంటిమెంటల్ బ్లాక్‌మెయిల్ చేస్తాడని... ఏడ్వడం, చేతులు కట్ చేసుకోవడం, దాన్ని వీడియోలు చేయడం.. లాంటివన్నీ చేసే వాడని చాలా విషయాలను బయట పెట్టింది. రేప్ సినిమాలు చూస్తాడని.. కానీ తనో పెద్ద వుమెనైజర్ అని అంగీకరించడని.. ఎన్నో పాపాలు చేశాడని ఆమె తెలిపింది.
భార్గవ్ కెమెరా ముందు ఒకలా.. వెనుక మరోలా ప్రవర్తించేవాడని సదరు యువతి చెప్పుకొచ్చింది. అందుకే అతడి నుండి దూరంగా కూడా వచ్చేశానని తెలిపింది. భార్గవ్‌ను మొదట్లో మంచివాడు అనుకునేదాన్ని.. కానీ అతడు వేరే అమ్మాయిలతో చేసే పనులు చూశాక.. అతడితో రక్షణ లేదనిపించిందని ఆ యువతి చెప్పుకొచ్చింది. మరి కొందరు కూడా టిక్ టాక్ భార్గవ్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు.