ఆక‌ట్టుకుంటున్న '3 రోజెస్' ట్రైల‌ర్

Three Roses Trailer out.పూర్ణ, ఇషా రెబ్బ, పాయల్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2021 9:17 AM GMT
ఆక‌ట్టుకుంటున్న 3 రోజెస్ ట్రైల‌ర్

పూర్ణ, ఇషా రెబ్బ, పాయల్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్'. ఎస్.కె.ఎన్. నిర్మించిన ఈ వెబ్ సిరీస్ న‌వంబ‌రు 12న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో నేడు ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి.. టీమ్ మొత్తానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఫ్రీడమ్ కోరుకుంటూ వేరే వ్యక్తి నీడలో ఎందుకు బ్రతకాలి? అనుకునే ఈ ముగ్గురి యువ‌తుల పెళ్లి చుట్టూ జరిగిన సంఘటనలను ఈ ట్రైల‌ర్లో ప్రస్తావించారు. 30 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా పెళ్లి కానీ అమ్మాయి పాత్ర‌లో పూర్ణ‌, అంద‌మైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌నుకునే యువ‌తిగా ఈషా, ట్రెక్కింగ్‌పై ఆస‌క్తి క‌న‌బ‌రిచే అమ్మాయిగా పాయిల్ క‌నిపించారు.

నేను పుష్ప‌వ‌తి అయిన‌ప్పుడు ఇది ఇంకా స్కూల్‌లో కూడా జాయిన్ అయి ఉండదు. అలాంటిది ఇప్పుడు దీనికి పెళ్లి కూడా అయిపోతుంది. నాకు ఎప్పుడు అవుతుందో అంటూ పూర్ణ చెప్పే డైలాగ్‌లు వెబ్ సిరీస్‌పై అంచనాల‌ను పెంచేశాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారీ ట్రైల‌ర్‌పై లుక్కేయండి.

Next Story
Share it