'తొలిప్రేమ' రీరిలీజ్‌..ఓ రేంజ్‌లో రచ్చ చేసిన పవన్ ఫ్యాన్స్‌

తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో 'తొలిప్రేమ' మూవీని రీరిలీజ్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  1 July 2023 9:55 AM IST
Tholi Prema, Re Release, Pawan kalyan, Fans, Theatre

'తొలిప్రేమ' రీరిలీజ్‌..ఓ రేంజ్‌లో రచ్చ చేసిన పవన్ ఫ్యాన్స్‌

తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో 'తొలిప్రేమ' మూవీని రీరిలీజ్‌ చేశారు. దీంతో.. పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. కొత్త సినిమాలు రిలీజ్‌ అయితే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో.. దానికి మించిన రేంజ్‌లోనే సంబరాలు చేస్తున్నారు అభిమానులు. పెద్ద పెద్ద కటౌట్లు కట్టి.. బ్యాండ్‌ బాజాతో సందడి చేస్తున్నారు. థియేటర్లలో స్కీన్ వద్దకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తున్నారు. సీఎం.. సీఎం.. అంటూ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కేకలు వేస్తున్నారు. కేకలు.. ఈలలు.. సంబరాలు సరే కాని.. కొన్ని చోట్ల మితిమీరి ప్రవర్తిస్తున్నారు. థియేటర్‌లో వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. తిరుపతిలోని ప్రతాప్‌ థియేటర్‌ వద్ద హంగామా చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు కొన్ని వస్తువులను విరగ్గొట్టారు. దీంతో.. స్పందించిన థియేటర్‌ యాజమాన్యం అభిమానులని మందలించింది.

ఇక మరోచోట కూడా థియేటర్‌లో రచ్చరచ్చ చేశారు. సినిమా ప్రదర్శితమవుతుండగా స్క్రీన్ వద్దకు చేరుకుని జనసేన జెండాలను ఊపుతూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా స్కీన్‌ను చించేసి ధ్వంసం చేశారు. స్క్రీన్‌ బేస్‌మెంట్‌పైనే కూర్చొని ఇతరులకు ఇబ్బంది కలిగించారు. స్కీన్‌ను చించేసి హంగామా చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోని సూపర్‌హిట్‌ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తవుతోంది. క్లాసిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం 4కె వెర్షన్‌లో ‘తొలిప్రేమ’ను శుక్రవారం రీ రిలీజ్‌ చేసింది.

Next Story