మ‌హేష్ బాబు అభిమానుల‌కు త‌ప్ప‌ని నిరాశ‌..

There is no update from Sarkaruvaaripaata.ప్రతి సంవత్సరం తన తండ్రి పుట్టినరోజున అభిమానుల కోసం ఏదైనా ప్రత్యేకత ఉండేలా చూసుకునే మహేష్ ఈ సంవత్సరం మాత్రం దానిని దాటవేయాలని నిర్ణయించుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2021 5:41 AM GMT
Maheshbabus  Sarkaruvaaripaata

సూప‌ర్ మ‌హేష్ బాబు అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. ఈ నెల 31న మ‌హేష్ తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మహేష్ న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ లుక్ విడుద‌ల అవుతుంద‌ని అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం తన తండ్రి పుట్టినరోజున అభిమానుల కోసం ఏదైనా ప్రత్యేకత ఉండేలా చూసుకునే మహేష్ ఈ సంవత్సరం మాత్రం దానిని దాటవేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా మ‌హేష్ త‌దుప‌రి చిత్రాల‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌లు ఇవ్వ‌డం లేద‌ని మ‌హేష్‌బాబు టీమ్ ట్విట్ చేసింది. దీంతో అభిమానులు కాస్త నిరాశ‌కు గురైయ్యారు.

'ప్ర‌స్తుతం స‌మాజంలో ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని త‌మ త‌దుప‌రి చిత్రాల‌కు సంబంధించిన అప్‌డేట్‌లు ఇవ్వ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని చిత్ర‌బృందం బావించింది. సినిమా అప్‌డేట్ గురించి ఎవ‌రూ కూడా అన‌ధికారికంగా, అవాస్త‌వాల‌ను ద‌య‌చేసి సృష్టించ‌వద్దు. చిత్రానికి సంబందించిన ఏ అప్‌డేట్ అయిన అధికారిక ఖాతాల్లో త‌ప్ప‌కుండా పోస్ట్ చేస్తాం. అప్ప‌టి వ‌ర‌కూ ద‌య‌చేసి జాగ్ర‌త్త‌గా ఉండ‌డండి. సుర‌క్షితంగా జీవించండి అని' టీమ్ పేర్కొంది.


Next Story