విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. లైగ‌ర్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Theatrical release date of Liger to be announced tomorrow.తాజాగా చిత్ర నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ అన‌న్య పాండే 'లైగ‌ర్' సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 10 Feb 2021 4:01 PM IST

Theatrical release date of Liger to be announced tomorrow

విజ‌య్ దేవ‌రకొండ హీరోగా సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'లైగ‌ర్‌'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ఉప శీర్షిక‌. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. యాక్షన్ అండ్ ఎంటర్టైన్‌మెంట్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కొద్ది రోజుల క్రితం విడుద‌ల చేయ‌గా.. అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. విజయ్ ఫైటర్‌గా క‌నిపించనున్న‌ ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ అన‌న్య పాండే 'లైగ‌ర్' సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.


రేపు ఉదయం 8:14 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నట్టు ఛార్మి, అన‌న్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబై షూటింగ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ ను చిన్న వీడియో ట్రాక్ తో ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్ద‌మ‌వుతోంది.


Next Story