రాధేశ్యామ్ : థియేటర్​కు తాళం.. ఎందుకంటే..?

Theatre seized in Srikakulam.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధేశ్యామ్. జిమ్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2022 10:51 AM GMT
రాధేశ్యామ్ : థియేటర్​కు తాళం.. ఎందుకంటే..?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం 'రాధేశ్యామ్'. జిమ్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించింది. ఈ చిత్రం ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మార్చి 25 వ తేదీ వ‌ర‌కు ఐదో షో వేసుకునేందుకు థియేట‌ర్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మాత్రం బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ల‌భించ‌లేదు. అధికారుల ఆదేశాల‌ను కాద‌ని బెనిఫిట్ షోలు వేస్తున్న థియేట‌ర్ల‌కు తాళాలు వేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం ప‌ట్ట‌ణంలోని ఎస్వీసీ థియేట‌ర్‌లో రాధేశ్యామ్ బెనిఫిట్ షోల‌ను వేశార‌ని అధికారులు థియేట‌ర్ల‌కు తాళాలు వేశారు. రెవెన్యూ అధికారులు థియేటర్ కు తాళాలు వేయడంతో ఈరోజు చిత్రాన్ని ప్రదర్శించడం లేదని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. దీనిపై ప్ర‌భాస్ అభిమానులు మండిప‌డుతున్నారు.

కాగా.. కొద్ది రోజుల క్రిత‌మే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల విష‌యంలో కొత్త జీవోను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం రెమ్యున‌రేష‌న్ కాకుండా చిత్ర బ‌డ్జెట్ వంద కోట్లు దాటితే 10 రోజుల పాటు టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునే అవ‌కాశాన్ని నిర్మాత‌ల‌కు ప్ర‌భుత్వం క‌ల్పిచింది. దీంతో రాధేశ్యామ్ చిత్ర సినిమా టికెట్ ధ‌ర‌ను రూ.25 వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఉంది.

Next Story
Share it