వాయిస్ ఆఫ్ రవన్న.. చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూరుపు కొండను వెలిగిద్దాం

The Voice Of Ravanna from Virata Parvam.రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న తాజా చిత్రం విరాట‌ప‌ర్వం. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2021 7:48 AM GMT
వాయిస్ ఆఫ్ రవన్న.. చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూరుపు కొండను వెలిగిద్దాం

రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న తాజా చిత్రం 'విరాట‌ప‌ర్వం'. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న సాయిప‌ల్లవి న‌టిస్తోంది. 1990ల్లో తెలంగాణ ప్రాంతంలో జ‌రిగిన కొన్ని వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈచిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా.. నేడు రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి 'వాయిస్ ఆఫ్ ర‌వ‌న్న' పేరుతో ఓ స్పెష‌ల్ టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ఇందులో అరణ్య అనే కలం పేరుతో పిలవబడే కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నారు. అతని అభిమాని వెన్నెల పాత్రను సాయి పల్లవి పోషించింది. ఇది యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథ అని చిత్ర బృందం తెలిపింది. రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్‌తో సాగే ఈ వీడియోలో రానా పలికే డైలాగ్‌లు అద్భుతమైన పొయెటిక్ ఫీల్‌తో, రివల్యూషనరీ దృక్పథంతో ఉన్నాయి. డి. సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడు వ‌స్తుందో చిత్ర బృందం ఇంకా వెల్ల‌డించ‌లేదు.

Next Story
Share it