రాశీ ఖన్నా సినిమాకు ట్యాక్స్ లేదట

22 ఏళ్ల క్రితం గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన రైలు ప్రమాదం గురించి తెరకెక్కిన ‘సబర్మతి రిపోర్ట్‌’ సినిమా లో విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషించారు.

By Medi Samrat  Published on  19 Nov 2024 9:15 PM IST
రాశీ ఖన్నా సినిమాకు ట్యాక్స్ లేదట

22 ఏళ్ల క్రితం గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన రైలు ప్రమాదం గురించి తెరకెక్కిన ‘సబర్మతి రిపోర్ట్‌’ సినిమా లో విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషించారు. సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సహా పలువురు రాజకీయ నాయకులు ప్రశంసలు గుప్పించారు.

"ది సబర్మతి రిపోర్ట్" నవంబర్ 15న రిలీజ్ అయింది. 2002లో జరిగిన గోద్రా రైలు సంఘటనల ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ ధీరజ్ సర్నా తెరకెక్కించాడు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ది సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రసంశలు కురిపించారు. ఈ సినిమాని మరింత మంది చూసేందుకు మధ్యప్రదేశ్ లో ఎలాంటి ట్యాక్స్ వసూలు చేయరని హామీ ఇచ్చారు. ది సబర్మతి రిపోర్ట్ సినిమాని పన్ను రహిత సినిమాగా ప్రకటించారు. ఈ సినిమాని తన కేబినెట్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చూడాలని కోరారు. 2002లో గుజరాత్‌లో గోద్రా స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి 59 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత పలు ప్రాంతాల్లో మత కలహాలు చెలరేగాయి.

Next Story