'అంటే సుంద‌రానికి' నుంచి పంచ‌క‌ట్టు సాంగ్ ప్రోమో

The Panchakattu Song Promo from Ante Sundaraniki movie.నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం అంటే సుందరానికి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2022 12:54 PM IST
అంటే సుంద‌రానికి నుంచి పంచ‌క‌ట్టు సాంగ్ ప్రోమో

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం 'అంటే సుందరానికి'. 'బ్రోచేవారెవ‌రురా' ఫేం వివేక్ ఆత్రేయా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న మ‌ల‌యాళీ భామ‌ న‌జ్రియా న‌జీమ్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి 'పంచ‌కట్టు' సాంగ్ ప్రొమోను చిత్ర‌బృందం కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసింది.

'ఏంటీ సార్ ఓకే నా..' అంటూ సాగే ఈ పాట ఆక‌ట్టుకుంటుంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నాని పంచెకట్టు మరియు గ్రూవ్స్‌లో రెచ్చిపోయాడు. భారతీయ సంగీతాన్ని వెస్ట‌ర్న్ సంగీతాన్ని క‌ల‌గ‌లిపిన‌ట్టుగా వివేక్ సాగ‌ర్ ఈ పాట‌కు అద్భుత‌మైన ట్యూన్ క‌ట్టాడు. హ‌ర్షిత్ గోలీ ర‌చించిన ఈ పాట‌ను ప్ర‌ముఖ లెజెండ‌రీ క‌ర్ణాట‌క సింగ‌ర్ పద్మశ్రీ అరుణ సాయిరాం పాడారు. ఇక పూర్తి పాట‌ను రేపు(ఏప్రిల్ 6న‌) విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story