భీష్ముడిగా బాలయ్య ఫోటో విడుద‌ల‌.. వైర‌ల్‌

The Occasion Of Bheeshma Ekadasi Balakrishna Released Stills Of His Bheeshma Character.నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2021 9:57 AM GMT
Bala Krishnas bishma getup

నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..'భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం.. అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం.అందుకనే `ఎన్ టీ ఆర్ కధానాయకుడు` చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను' అని అన్నారు బాల‌కృష్ణ‌. భీష్మ గెట‌ప్‌లో ఉన్న ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.ప్ర‌స్తుతం బాల‌కృష్ణ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బీబీ3 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా పూర్తీ చేసుకొంటోంది. మే 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story