'పుష్ప-2' రిలీజ్‌ వాయిదాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా 'పుష్ప 2' విడుదల వాయిదా పడిందని వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది.

By అంజి  Published on  11 Jan 2024 12:10 PM IST
Movie makers, Pushpa 2, Allu Arjun, Sukumar

'పుష్ప-2' రిలీజ్‌ వాయిదాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా 'పుష్ప 2' విడుదల వాయిదా పడిందని వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. 2024 ఆగస్టు 15న సినిమా విడుదల అవుతుందని మూవీ టీం స్పష్టం చేసింది. పుష్ప నటుడు జగదీశ్‌ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లడంతో సినిమా రిలీజ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. ఇవాళ దర్శకుడు సుకుమార్‌ జన్మదినం సందర్భంగా పుష్ప యూనిట్‌ రిలీజ్‌ డేట్‌ని మరోసారి ట్వీట్‌ చేసింది. సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా తమ దర్శకునికి స్పెషల్ విషెస్ తెలియజేసింది. సుకుమార్ విజన్‌తో 'పుష్ప 2' మరింత గ్రాండ్ గా మరింత లెవెల్లో తెరకెక్కుతోందని తెలిపింది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్లుగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా జగదీష్‌, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పుష్ప 2 నుంచి మరో అదిరిపోయే ఐటంసాంగ్‌ రాబోతుందట. పుష్ప సీక్వెల్‌లో వచ్చే ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీస్ దిశాపటానీ అండ్ కృతిసనన్‌ పుష్ప రాజ్ తో చిందులేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్‌ను రామోజీఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరిస్తున్నారు.

Next Story